నల్లగొండ జిల్లాలో డీజేల వినియోగంపై నిషేధం

నల్గొండ జిల్లా పరిధిలో ఈ నెల 14 వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డిజే లతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్స్ ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి ప్రకటనలో తెలిపారు.

Update: 2024-10-03 14:54 GMT

దిశ,నల్లగొండ: నల్గొండ జిల్లా పరిధిలో ఈ నెల 14 వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డిజే లతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్స్ ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా.. నిషేధించడం జరిగిందన్నారు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనూ అధిక శబ్ధం కలిగించే డి‌జే లను వినియోగించ రాదన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను చట్టాన్ని ఉల్లంఘించి, ఎవరైనా వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ విషయంలో పోలీసు వారికి సహకరించాలని సూచించారు.


Similar News