మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తామని నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-21 09:52 GMT

దిశ, మిర్యాలగూడ : ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తామని నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు నూతన డయాలసిస్ సెంటర్లను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మిర్యాలగూడ పట్టణంలో కార్మికులు ఎక్కువగా ఉండటంతో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మిర్యాలగూడకు జిల్లా కేంద్రం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, దాంతో ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే సహకారంతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..దాతల సహకారంతో సిటి స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్ తో పాటు అటెండర్ల నివాసం కోసం షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిని ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా అన్ని రకాల వసతులతో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య పరిపాలన అధికారి సత్రు నాయక్, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, కౌన్సిలర్లు వంగాల నిరంజన్ రెడ్డి, బండి యాదగిరి రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, మంత్రాల రుణాల్ రెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, చిలుకూరి బాలు, నాయకులు స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి, పొదిల శీను, తరికొప్పల సైదులు, జానకిరామ్ రెడ్డి, అమృతా రెడ్డి, బాసాని గిరి తదితరులు పాల్గొన్నారు. 


Similar News