అంగన్వాడీల ముందస్తు అరెస్టులు..

రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ టీచర్లు, డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2023-10-04 12:38 GMT

దిశ, నాంపల్లి : రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ టీచర్లు, డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా అంగన్ వాడీ టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. నాంపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఇందిరాపార్క్ ధర్నాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌లను ఖండించిన అంగన్వాడి టీచర్లు, ఆయాలు.. తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ పోరాటాలను ఆపలేరని అన్నారు.

అఖిలపక్షాల అరెస్ట్..

నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష బుధవారం 21వ రోజుకి చేరుకుంది. అయితే మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని అఖిలపక్షాలు అడ్డుకుంటాయన్న సమాచారంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేసి మర్రిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. నాంపల్లి మండలం అభివృద్ధిలో చాలా వెనకబడిపోయింది ఈ మండలం రెవెన్యూ డివిజన్ అయితే కొంతైనా అభివృద్ధి జరుగుతుందని తమ సమస్యలను కనీసం మంత్రికి చెప్పుకోవాలన్ని అనుకున్నాము.. కానీ పోలీసులు ఇలా అరెస్టులు చేయడం దారుణమన్నారు. అరెస్టు చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు పూల వెంకటయ్య , ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు నాంపల్లి చంద్రమౌళి, తెలంగాణ అమరవీరుల ఆశయాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం, బీజేవైఎం మండల నాయకులు పానగంటి మహేష్ , మహాత్మా తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News