మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత
ప్రాణాంతక మాదకద్రవ్యాలకు బానిసై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుందని స్థానిక ఎస్సై బి అజయ్ కుమార్ అన్నారు.
దిశ, నడిగూడెం: ప్రాణాంతక మాదకద్రవ్యాలకు బానిసై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుందని స్థానిక ఎస్సై బి అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మాదకద్రవ్యాలను సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగం గురించి తెలిసిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలన పై ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై జగన్నాథం, పోలీసు సిబ్బంది వీరబాబు పాల్గొన్నారు.