దిశ ఎఫెక్ట్​ … వడ్లు కొనడానికి స్పందించిన అధికారులు

నల్గొండ జిల్లా కనగల్లు మండలం జి.యడవెల్లి గ్రామంలో రైతులు చేస్తున్న ధర్నాకు దిశలో వడ్లు కొనాలి, అనే కథనానికి అధికారులు డిఆర్డిఓ పిడి ఆదేశాలతో తహసీల్దార్ పద్మ, డిపిఎం రామలింగయ్య, ఏపీఎం సంకు హరి, శుక్రవారం సాయంత్రం దిశ కథనానికి వెంటనే స్పందించారు.

Update: 2024-04-12 16:31 GMT

 దిశ, కనగలు: నల్గొండ జిల్లా కనగల్లు మండలం జి.యడవెల్లి గ్రామంలో రైతులు చేస్తున్న ధర్నాకు దిశలో వడ్లు కొనాలి, అనే కథనానికి అధికారులు డిఆర్డిఓ పిడి ఆదేశాలతో తహసీల్దార్ పద్మ, డిపిఎం రామలింగయ్య, ఏపీఎం సంకు హరి, శుక్రవారం సాయంత్రం దిశ కథనానికి వెంటనే స్పందించారు. జి.యడవల్లి ఐకెపి కేంద్రాన్ని సందర్శించిన అధికారులు ధర్నా చేసిన రైతులను సంప్రదించి వడ్లు కాంట వేసుకోవడానికి రమ్మనగా రైతులు రాకపోగా వడ్లు బయట అమ్ముకుంటాం ఆ తర్వాత సీరియల్ వాళ్లకు వడ్లు కాంట వేయగలరు అని రైతులు తెలిపారు. రైతుల స్పందన అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది .రైతులు చేసిన ధర్నా ఉద్దేశం ఏంటని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.


Similar News