జన ఆదరణ పొందిన పత్రిక దిశ దినపత్రిక..
జన ఆదరణ పొందిన పత్రిక దిశ దినపత్రిక అని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకoడ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
దిశ,సూర్యాపేట టౌన్; జన ఆదరణ పొందిన పత్రిక దిశ దినపత్రిక అని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకoడ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 2025 దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలకు వార్తలు అందించడంలో దిశ దినపత్రిక ముందంజలో ఉందన్నారు. కొద్దిరోజుల కాలంలోనే తనకంటూ ప్రజలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని దిశ దిన పత్రికను కొనియాడారు. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాస్తున్న దిశ దిన పత్రికకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు,సూర్యాపేట జిల్లా ప్రజలకు, దిశ దినపత్రిక యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు,దిశ దినపత్రిక రిపోర్టర్లు తండ నాగేందర్,కొంగల సతీష్, బొల్లికొండ వీరస్వామి, పెద్దపోలు వీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.