అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలో సీసీ రోడ్లు, పంచాయతీ భవన శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Update: 2023-02-20 15:53 GMT

దిశ, పెన్ పహాడ్: అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలో సీసీ రోడ్లు, పంచాయతీ భవన శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సింగరేణి పాలెం, అనంతరం, పొట్లపాడు, అన్నారం బ్రిడ్జి, నాగులపాటి, నారాయణ గూడెం, నాగులపహాడ్, అనాజిపురం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దోస పహాడ్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి అన్ని గ్రామాల సీసీ రోడ్లకు రూ.1.65 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు కావడంతో సోమవారం ఆయన ఆ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. దేశ ప్రజలు కూడా సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.

పల్లెల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం గ్రామంలో మూసి నీటిని చివరి భూములకు కూడా అందించాలని రైతులు వినతి పత్రం అందించగా, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మది బిక్షం, జడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు వెన్న సీతారాం రెడ్డి, నాతాల జానకిరాం రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగంధర్, ఆయా గ్రామాల సర్పంచ్ లు షేక్ షరీఫుద్దీన్, బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రమణ, దేవయ్య, దనేకుల కోటమ్మ, సత్యనారాయణ, మండలి మల్లయ్య, రాయలి, లక్ష్మి శ్రీనివాస్, దొంగరి సుధాకర్, చెన్ను శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News