కోమటిరెడ్డిపై కైలాస్ నేత ఆగ్రహం

ఢిల్లీలో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ....Congress Leader Punna Kailash Respond On Komatireddy's Comments

Update: 2023-02-14 13:16 GMT

దిశ, నల్లగొండ: ఢిల్లీలో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత అన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం పున్న కైలాష్ నేత మాట్లాడుతూ ఢిల్లీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివిధ సామాజిక మాధ్యమాలలో దుమారం లేపుతున్నాయని, అలాంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనోధైర్యానికి గురికాకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో జత కట్టడం అనేది అసాధ్యమైన పని అని, దానిని ఏఐసీసీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణ పర్యటనలో భాగంగా స్పష్టం చేసిన విషయం తెలిసిందేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవిధంగా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలను గందరగోళపరిచే విధంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ తో జత కట్టేదే లేదన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండే విధంగా నిర్ణయాలను తీసుకుంటుందన్నారు.

Tags:    

Similar News