న్యూ ఇయర్‌ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరించారు.

Update: 2024-12-29 15:12 GMT

దిశ,కనగల్లు: న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరించారు. ఆదివారం కనగల్లు పోలీస్ స్టేషన్ ను సందర్శించి మాట్లాడుతూ..రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. వేడుకలను కుటుంబ సమేతంగా, ఇళ్లల్లో సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం,ట్రిబుల్, రాష్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులకు పాల్పడడం, రోడ్లపై వెళ్లే వారిని ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఆకస్మిక తనిఖీలతో పాటు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బయటకు పంపించి ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఎస్ఐ పి.విష్ణు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News