యాదాద్రి కొండపైన బీర్ల ఐలయ్య రివ్యూ మీటింగ్

యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రివ్యూ సమావేశం నిర్వహించారు.

Update: 2024-06-12 15:18 GMT

 దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధిపై, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సమావేశంలో మాట్లాడారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి భక్తులకు తాత్కాలిక షెడ్డు నిర్మాణంతో వారు ప్రశాంతంగా ఉంటున్నారని ఈ విషయం పట్ల ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు. అదే విధంగా మరికొన్ని చోట్ల మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ చేసే వారికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.

డార్మెంటరీ హాల్ లో పడుకునే వారి సంఖ్య ఎక్కువ ఉండేందుకు హల్ పెంచుతున్నట్లు,తెలిపారు. అన్నదాన సత్రంలో 1000మంది భక్తులు భోజనం చేసేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో పాటు కొండపైన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గూడురూ టోల్ గెట్ నుండి రాయగిరి కమాన్ వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.మెట్ల మార్గంపై సోలార్ షెడ్ నిర్మాణం చేసి నీటి సౌకర్యం తో పాటు,మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఆలయంలో సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని వారికి ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.దాంతోపాటు యాదాద్రిలోని పలు కూడళ్లలో స్వామివారి పేర్లతో నామకరణం చేయాలని సూచించారు. భక్తులకు ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు. ఎల్ఇడి స్క్రీన్స్ ద్వారా ఆలయంలో జరిగే పూజలను ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.అదేవిధంగా మీడియా వారికి మీడియా పాయింట్ కూడా ఏర్పాట్లు చేయునట్లు తెలిపారు.


Similar News