సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ కె.అపూర్వరావు:

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ని ఆసరగా చేసుకొని సులువుగా డబ్బులు సంపాదించాలనే సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిందని వారి వీరి మాయలో పడి వారి ఎత్తులకు ఎంతో మంది అమాయకులు బలవుతున్నారని ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు.

Update: 2023-02-22 15:06 GMT

దిశ, నల్లగొండ: మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ని ఆసరగా చేసుకొని సులువుగా డబ్బులు సంపాదించాలనే సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిందని వారి వీరి మాయలో పడి వారి ఎత్తులకు ఎంతో మంది అమాయకులు బలవుతున్నారని ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు.సైబర్ నేరాల పట్ల ఆమె అవగాహనా కార్యక్రమాన్ని బుధవార నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తుల నెంబర్ల నుంచి వచ్చే లింకులు, మెసేజ్ లు క్లిక్ చేయకూడని, నకిలీ వెబ్ సైట్ల ద్వారా అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బు లాగేస్తున్నారని ఆమె తెలిపారు.

అంతే కాకుండా వైద్య సహాయం, పేరు పొందిన కంపెనీలలో ఉద్యోగాల పేరుతో సులభంగా నమ్మే మోసాలను ఎంచుకొని మోసాలు చేస్తున్నారని ఆమె తెలిపారు. లోన్ యాప్ అంటూ సులభంగా లోన్లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ, అదేవిధంగా మీ డేటా మొత్తం వారి అధీనంలోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరూ లాంటి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోకూడదని, ఎవరైనా అలాంటి మోసాలకు గురైతే వెంటెనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని లేని యెడల హెల్ప్ లైన్ నెం.1930కి లేదా 155260 కి కాల్ చేయాలన్నారు.  

Tags:    

Similar News