భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై దాడి..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

భార్యని కాపురానికి పంపడం లేదని అత్తపై అల్లుడు దాడి చేసిన సంఘటన సోమవారం నేరేడుచర్లలో జరిగింది.

Update: 2024-10-28 15:27 GMT

 దిశ ,నేరేడుచర్ల : భార్యని కాపురానికి పంపడం లేదని అత్తపై అల్లుడు దాడి చేసిన సంఘటన సోమవారం నేరేడుచర్లలో జరిగింది. నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందిన లావుడి నాగేశ్వరరావుకు పాలకవీడు మండలం చెరువు తండా గ్రామానికి చెందిన బానోత్ సునీతకు సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. గత సంవత్సరం నుంచి భార్య సునితను అత్త నీల( 45) కాపురానికి పంపకపోవడంతో..ఇటీవల రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ పంచాయతీలో ఇరు వర్గాల పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం సునీతను భర్త నాగేశ్వరరావు వద్దకు పంపాలి. కానీ పెద్ద మనుషులు మాటలు వినకుండా తన భార్యను సునీతను తన అత్త నీల కాపురానికి పంపడం లేదని ఆగ్రహంతో నాగేశ్వరరావు తన అత్తపై నేరేడుచర్ల పట్టణంలోని జాన్ పహాడ్ రోడ్డులో ఇనుప రేంచ్ తో దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తలపై బలమైన గాయం ఏర్పడిందన్నారు. వెంటనే 108 వాహనంలో మిర్యాలగూడ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నీల పరిస్థితి విషమంగా ఉందని నీల భర్త రామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు పడుతున్నట్లు ఎస్సై తెలిపారు.


Similar News