నీటిపారుదల శాఖ.. రోడ్డు భవనాల శాఖ అధికారుల మధ్య మాటల యుద్ధం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పునరుజ్జీవనంలో భాగంగా మండలంలోని సంగెం గ్రామ పరిధిలోని భీమ లింగం కత్వా వద్ద 8 వ తేదీన పాదయాత్ర చేయనున్నారు.
దిశ, వలిగొండ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పునరుజ్జీవనంలో భాగంగా మండలంలోని సంగెం గ్రామ పరిధిలోని భీమ లింగం కత్వా వద్ద 8 వ తేదీన పాదయాత్ర చేయనున్నారు. ఈ ఏర్పాట్ల పనుల సందర్భంగా అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది.
నీటిపారుదల శాఖ అధికారులు ఎవరూ ఇక్కడ కనిపిస్తలేరని, ఇక్కడి పనులేం మీశాఖ వారు పట్టించుకోరా అని రోడ్లు భవనాల శాఖ ఈఈ బాలప్రసాద్ నీటిపారుదల శాఖ జిల్లా అధికారులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న డీఈ బాలకృష్ణ స్పందించి మా శాఖ గురించి నీకెందుకు, అసలు నీవెవరు అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి నువ్వెంత పో అంటే నువ్వెంత అనే మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ తతంగమంతా సాక్షాత్తు జిల్లా అదనపు కలెక్టర్ సమక్షంలో చోటు చేసుకోవడం గమనార్హం.