డీఆర్‌డీఏలో భారీ కుంభకోణం... ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైనం..?

సూర్యాపేట జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో భారీ కుంభకోణం

Update: 2024-11-06 14:24 GMT

దిశ,సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేటజిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 లో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో DRDA కార్యాలయంలో స్విపర్ గా పనిచేస్తున్న మహిళ కి తేది 30-10-2019 లో ఆది మల్ల నవ్య కు స్వీపర్ గా సెర్ప్ లో ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇదే అదునుగా చేసుకొని హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఉద్యోగ ఆర్డర్ నీ చూపిస్తూ అదే శాఖలో పనిచేస్తున్న అధికారులు ఆ మహిళను ఇప్పటివరకు తాత్కాలికంగా పని చేసావు. ఇప్పుడు నీకు హెడ్ ఆఫీస్ నుంచి నీకు ఆర్డర్ వచ్చింది నీకు భవిష్యత్తులో పర్మినెంట్ అయ్యే అవకాశం ఉన్నది కనుక అప్పటి అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు. ఆ మహిళా ఉద్యోగికి ఉద్యోగ ఆర్డర్ కాపీ ఇవ్వకుండా అడ్డుకోవడంతో పాటు వేధింపులకు గురి చేశారు. ఆ మహిళ ను 2019 నుండి నేటి వరకు ఉద్యోగం చేయనివ్వడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆది మల్ల నవ్య కు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని దిశ పత్రిక వార్త కథనాలు ప్రచురించింది.

కానీ ఆ మహిళను ఉద్యోగానికి రాకుండా అడ్డుకున్న అధికారులే అదే మహిళా ఉద్యోగి పేరుమీద 2019 నుండి 2024 మార్చి నెల వరకు జీతం తీసుకోవడం సూర్యాపేట డీఆర్ డిఏ అధికారులకే సాధ్యమైందని పలువురు ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఆ మహిళా ఉద్యోగి నానా రకాల ఇబ్బందులకు గురవుతూ నెల నెల జీతం లేక కూలి నాలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే స్థోమత కూడా లేకుండా కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఆ మహిళా ఉద్యోగి జీతాన్ని నెల నెల ఆమె జీతం అప్పనంగా కాజేస్తూ ఆ డబ్బులతో పబ్బం గడుపుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఆ మహిళా ఉద్యోగి జీతం ఇప్పటి వరకు సుమారు రూ. ఎనిమిది లక్షల రూపాయల వరకు కాజేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ మహిళా ఉద్యోగిని ఉద్యోగం లోకి రాకుండా వేధింపులకు గురిచేసి ఆ కుటుంబాన్ని బజారున పడటానికి కారణమైన ఉద్యోగులందరిపైన సమగ్ర విచారణ జరిపించి మహిళా ఉద్యోగిని జీతం కాజేసిన అధికారుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని అన్యాయానికి గురైన మహిళ ఉద్యోగికి న్యాయం చేసి ఆ మహిళా ఉద్యోగినికి తన ఉద్యోగం తనకు ఇప్పించి ఇన్ని రోజులు కోల్పోయిన జీతాన్ని తిరిగి ఇప్పించి ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కాజేయడంలో భాగస్వాములైన ఉద్యోగులందరి పైన కేసు నమోదు చేయాలని పలువురు కోరుకుంటున్నారు.DRDA లో తవ్విన కొద్ది ఒక్కొక్కటిగా అక్రమాల చిట్టా బయట పడుతుండడంతో పలువురిని ఆశ్చర్యపరుస్తుంది . అనర్హులైన చాలా మంది వ్యక్తులు DRDA లో విధులు నిర్వహిస్తున్నట్లు విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి.వివరణ కోసం DRDO అప్పారావు ను ఫోన్ లో సంప్రదించగా ఆదిమల్ల నవ్యకు ఎలాంటి జీతం చేయలేదని తెలిపారు.


Similar News