పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు : భువనగిరి ఎమ్మెల్యే
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి పంట కొనుగోళ్లలో
దిశ,వలిగొండ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి పంట కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా ఉండాలని రైతులు నష్టపోయే విధంగా వ్యవరించవద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని నెమలి కాల్వ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర సాయి జిన్నింగ్ మిల్ లో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మందుల శామెల్ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజ, పత్తి బుగ్గ రైతు చెమట చుక్క కష్టమని రైతులను కాంటాలలో, తేమ సాగుతో రైతులను మోసం చేస్తే సహించబోమని అన్నారు. గత ప్రభుత్వం మంత్రులు బావ బామ్మర్దులు 10 నెలలోనే వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శిస్తున్నారు.
అందుకే ప్రజలు బుద్ధి చెప్పిన అహంకార ధోరణి వీడకుండా వ్యవహరించడం ఏమిటని,విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెలలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టనున్నారు. మీ ప్రభుత్వంలో బొందల గడ్డలు, శ్మశాన వాటికలు, వైకుంఠధామాలు నిర్మించారు. మీరు మాత్రం పది సంవత్సరాలలో 100 సంవత్సరాల ఆదాయాన్ని కూడగట్టుకున్నారని ఈ ప్రజా పాలనలో మీ జిమ్మిక్కులు నడవవని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, గరిసె రవి, తుమ్మల యుగేందర్ రెడ్డి, బెలిదే నాగేశ్వర్ పబ్బు ఉపేందర్ బోస్, గూడూరు శివ శాంతి రెడ్డి, చిట్టెడి జనార్దన్ రెడ్డి, బీమా నాయక్, కొండూరు భాస్కర్,కాసుల వెంకన్న, కొండూరు సాయి,మార్కెట్ కార్యదర్శి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.