ఏడాదిలో అద్భుత విజయాలు సాధించా :ఎమ్మెల్యే

2024లో నియోజకవర్గ అభివృద్ధి పరంగా అన్ని అద్భుతమైన విజయాలు సాధించానని,ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ ఒక చారిత్రాత్మకమైనవని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తెలిపారు.

Update: 2024-12-31 12:21 GMT

దిశ,తుంగతుర్తి: 2024లో నియోజకవర్గ అభివృద్ధి పరంగా అన్ని అద్భుతమైన విజయాలు సాధించానని,ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ ఒక చారిత్రాత్మకమైనవని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తెలిపారు. కొత్త ఏడాదిలో (2025) నియోజకవర్గ అభివృద్ధికి ఇంకెంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం పురస్కరించుకొని ఆయన మంగళవారం సాయంత్రం “దిశ”తో మాట్లాడారు. గత ఏడాదిలో రూ.30 కోట్ల వ్యయంతో,ధర్మారం,వర్ధమానుకోట, లక్ష్మీదేవి కాలువ,సుదర్శపురం,చిన్నపడిశాల,జానకిపురం ప్రాంతాలలో చెక్ డ్యాములు నిర్మించడం చరిత్రకే రికార్డుగా నిలిచిందని అన్నారు. అంతేకాకుండా తిరుమలగిరిలో జూనియర్ కళాశాల,మోత్కూరులో విద్యార్థులకు హాస్టల్, ఆసిఫ్ నగర్ కాలువ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇప్పించడం,ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏర్పాటు వంటివి ఇంకెన్నో ప్రధానంగా నిలిచాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరాచక పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని, ఇందులో భాగంగానే సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని వివరించారు. కొత్త ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలన్ని అందరికీ అందాలని,ప్రజలంతా ఐకమత్యంతో కలిసి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు,అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. 


Similar News