చిట్యాలకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కేటాయించాలని వినతి

నకిరేకల్ నియోజకవర్గంలో మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను చిట్యాల మండలంలో ఏర్పాటు చేయాలని చిట్యాల అఖిలపక్ష నాయకులు బుధవారం మ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతి పత్రం అందజేశారు.

Update: 2024-12-31 11:51 GMT

దిశ, చిట్యాల: నకిరేకల్ నియోజకవర్గంలో మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను చిట్యాల మండలంలో ఏర్పాటు చేయాలని చిట్యాల అఖిలపక్ష నాయకులు బుధవారం మ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని కేవలం చిట్యాల మండలంలోని లేవని, దీని దృష్టిలో ఉంచుకొని ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటును చిట్యాలలో జరిగేలా కృషి చేయాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ గురుకుల పాఠశాల ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని చూస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, సిపిఐ ఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్ బొబ్బలి సుధాకర్ రెడ్డి, బిజెపి నాయకులు చికిలంమెట్ల అశోక్, కన్నెబోయిన మహలింగం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మెడి శంకర్, ఎర్రసాని గోపాల్, కనకదుర్గ ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు , మున్సిపల్ కౌన్సిలర్లు బెళ్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, గ్యార మారయ్య, పోకల యేసు రత్నం, జిట్ట చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. 


Similar News