కాలుష్య విరజిమ్మే సిమెంట్ ఫ్యాక్టరీ రద్దు చేయాలి

కాలుష్యాన్ని వెదజల్లే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని రామన్నపేటలో ఏర్పాటు చేయొద్దని అఖిలపక్షం నాయకులు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలను కలిసి వినతి పత్రం అందజేశారు.

Update: 2024-10-13 10:10 GMT

దిశ,రామన్నపేట : కాలుష్యాన్ని వెదజల్లే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని రామన్నపేటలో ఏర్పాటు చేయొద్దని అఖిలపక్షం నాయకులు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..... లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని రైతులను నమ్మించి గత రెండు సంవత్సరాల క్రితం రామన్నపేట-కొమ్మయిగూడెం రెవిన్యూ శివారులో సుమారు 350 ఎకరాల వ్యవసాయ భూములు కొనుగోలు చేసి.. ఇప్పుడు కాలుష్యాన్ని విరజిమ్మే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. మండలంలో ఎలాంటి కాలుష్యం లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేసేలా కృషి చేసి మండల ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడాలని వినతిపత్రంలో కోరారు. రామన్నపేట పట్టణ కేంద్రంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో అఖిలపక్ష నాయకులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పూస బాలకిషన్, జెల్లెల పెంటయ్య, మేక అశోక్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశ్, గోదాసు పృద్వి రాజ్, మామిడి వెంకట్ రెడ్డి, ఎర్ర రమేష్, ఎండి నాసర్, ఎండి రెహాన్, ఎండి జమీరుద్దీన్, ఎం‌డి అక్రం, ఎర్ర రమేష్, ఫజల్ బేగ్, గురుజాల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News