వైన్ షాప్ యజమానులపై కేసులు నమోదు

ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ..ఉదయాన్నేవైన్ షాపులు తెరవడంతో చౌటుప్పల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.యా

Update: 2024-10-12 11:24 GMT

దిశ,చౌటుప్పల్: ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ..ఉదయాన్నేవైన్ షాపులు తెరవడంతో చౌటుప్పల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సాయి వైన్స్, సాయి దుర్గ వైన్స్, ఎస్పిఆర్ వైన్స్,ఎస్వి వైన్స్ మొత్తం నాలుగు వైన్స్ షాపుల యజమానులు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా శనివారం ఉదయం 8:30 గంటలకే తెరిచి ఉంచారు. షాప్ లను తెరవాల్సిన సమయానికి కన్నముందే తెరవడంతో.. వైన్స్ షాప్ ల యజమానులు, క్యాషియర్ లపై కేసు నమోదు చేసి ఎస్సై కనకటి యాదగిరి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సిఐ మన్మధకుమార్ తెలిపారు. అంతేకాకుండా సంస్థాన్ నారాయణపురం మండలంలోని వైన్సులు కూడా నిర్ణీత సమయానికి ముందే షాపులు తెరిచి మద్యం అమ్మకాలు చేపట్టారు. వీరిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి.


Similar News