ఉరకలెత్తిన కృష్ణమ్మ..సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత

దిశ, నాగార్జునసాగర్: నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి క్రస్ట్‌ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు.

Update: 2024-08-29 12:07 GMT

దిశ, నాగార్జునసాగర్: నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి క్రస్ట్‌ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. బిరా బిరా మంటూ పరిగెడుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు అందంగా కృష్ణమ్మ పరవళ్లు పెడుతుండడాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. నాగార్జున సాగర్‌ 26 గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. పాలనురగలా స్పీల్‌ వే గుండా కృష్ణమ్మ పరవళ్లు తోక్కుతోంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జలసోయగాలు వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ జళకళను సంతరించుకుంది.

శ్రీశైలం నుంచి భారీగా వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్‌ డ్యాం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు డ్యామ్ గేట్లన్నీ ఎత్తారు. 26 గేట్లు ఎత్తడంతో నీళ్లు జాలువారుతూ సాగర్ వద్ద అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండడంతో నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని 2,65,904 దిగువకు వదులుతున్న అధికారులు. ఎగువన శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 26 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో : 3,14,910 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 3,14,910 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.. ఇక ప్రస్తుత నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీలుగా కొనసాగుతుంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,394 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 9160 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8280 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులు, లోలెవల్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కులు, మొత్తం 3,14,910 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది

పర్యటకుల సందడి..

నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో సాగర్ నిండుకుండలా మారి, ఆహ్లాదం పంచుతోంది. ఇటు గేట్ల నుంచి పాలధారల్లా దూకుతున్న కృష్ణమ్మ కనువిందు చేస్తోంది. మరో దిక్కు సాగర్ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం సందర్శకుల మదిని దోచుకుంటోంది. సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ‌కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు నాగార్జునసాగర్‌ డ్యాం క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో ఆ జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో డ్యాం పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి.


Similar News