హైడ్రా కాన్సెప్ట్ అదే కచ్చితంగా శిక్షిస్తుందంటూ నాగబాబు సంచలన ట్వీట్.. నాగార్జునను ఉద్దేశించేనా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-01 11:20 GMT

దిశ, సినిమా: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, నాళాల ఆక్రమణలకు పాల్పడి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారి జాబితాను సిద్ధం చేసి సమాచారంతో అక్రమ కట్టాడాలను కూల్చివేస్తోంది. ఇప్పటికే హైడ్రా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేసిన ఘటన రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తుమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో N కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అయితే దీనిపై నాగార్జున ట్విట్టర్ వేదికగా క్లారిటీ కూడా ఇచ్చాడు. N కన్వెన్షన్ కూల్చివేతపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగబాబు హైడ్రా కాన్సెప్ట్ అదే అని సంచలన ట్వీట్ చేశాడు. ‘‘వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్‌లకు కూడా నీళ్లు రావడం, కొన్ని సామాన్య ప్రాణాలు కూడా బలితీసుకోవడం చాల బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులను, నాళాలను అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే.

ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిద్దాం. మీ సాహసోపేత నిర్ణయాలకు, ప్రశంసనీయమైన పనికి. మేము మీకు పూర్తి మద్దతుగా నిలుస్తాము. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది‌’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ నాగబాబు ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా నాగార్జునను ఉద్దేశించే చేశాడని చర్చించుకోవడం మొదలెట్టారు. 


Similar News