రెండుచోట్లా నాదే గెలుపు : Etela Rajender

హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్లా తన గెలుపు ఖాయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2023-10-25 14:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్లా తన గెలుపు ఖాయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తికి తాను కానని ఆయన వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బుధవారం 'అలయ్ బలయ్' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై ఈటల స్పందించారు. మొన్నటికి మొన్న.. బీఆర్ఎస్‌కు.. బీజేపీయే ప్రత్యామ్నాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారని, మరి ఇప్పుడెలా మాట మార్చారని ఈటల ప్రశ్నించారు. తాను రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇంకా చదవలేదని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..