CM Revanth Reddy: బండ్లగణేశ్ తో పాటు సీఎం వద్దకు దేవీశ్రీ ప్రసాద్.. మేటర్ ఏంటంటే?

సీఎం రేవంత్ రెడ్డిని మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కలిశారు.

Update: 2024-10-16 07:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కలిశారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను దేవిశ్రీప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నెల 19న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న మ్యూజిక్ ఈవెంట్ కు రావాలని ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించారు. ఈ సమావేశంలో దేవీశ్రీ ప్రసాద్ వెంట ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు. 


Similar News