Murali Akunuri: శభాష్ రంగనాథ్.. మంచిపని చేస్తున్నారు.. మాజీ ఐఏఎస్ ప్రశంసలు

శభాష్ రంగనాథ్ మంచి పని చేస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రంగనాథ్ కి పూర్తి ప్రోత్సాహం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు.

Update: 2024-08-15 11:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శభాష్ రంగనాథ్ మంచి పని చేస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రంగనాథ్ కి పూర్తి ప్రోత్సాహం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైడ్రా సంస్థ చేపడుతున్న కూల్చివేతలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఈ సంస్థ కమీషనర్ ఏవీ రంగనాథ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ఒక అడ్మినిస్ట్రేటివ్ చిట్కా కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా.. మంచి పని చేస్తున్నారు శభాష్ రంగనాథ్.. మరింత ముందుకు సాగండి అని చెప్పారు. మన ప్రజాప్రతినిధులు చాలా మంది దీనిని సహజంగా తీసుకొని అడ్డగోలుగా ప్రభుత్వ, చెరువు శిఖం భూములను ఆక్రమిస్తున్నారని, గత పాలకులు మేము తింటాము మీరు తినండి అని అందరిని దొంగలుగా మార్చినారని సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల భూములను, ప్రాణాలను రక్షించే చెరువులను కాపాడుకోవాలని చెబుతూ.. భవిషత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని తెలియజేశారు.

ఇక ముఖ్యమంత్రి హైడ్రా ని ఇంకా బలోపేతం చెయ్యండని, రాష్ట్రం మొత్తానికి హైడ్రాని విస్తరించి, ప్రభుత్వ భూములను చెరువులను కాపాడాలని కోరారు. అలాగే రంగనాథ్ కి పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పారు. మనం ట్రాన్స్ పరెంట్ గా ఉండడమే కాదు ఉన్నట్టు కూడా కనిపించాలని, ఇది రంగనాథ్ కి అడ్మినిస్ట్రేటివ్ టిప్ అని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజేన్సీ (హైడ్రా) ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు కమీషనర్ గా ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను నియమించింది. దీంతో ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల అక్రమణలకు సంబందించిన ఫర్యాదులను పరిగణలోకి తీసుకొని హైడ్రా ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై కొరఢా ఝులిపిస్తున్నారు.

https://x.com/Murali_IASretd/status/1823989470380650866

Tags:    

Similar News