ఖమ్మం ను ముంచెత్తిన మున్నేరు వాగు.. 30 అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా పట్టణాన్ని ఆనుకొని ఉన్న మున్నేరు వాగు భీకర స్థాయిలో ప్రవహిస్తుంది.

Update: 2024-09-02 04:14 GMT

 దిశ, వెబ్ డెస్క్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా పట్టణాన్ని ఆనుకొని ఉన్న మున్నేరు వాగు భీకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో ఖమ్మం నగరం వరదలో చిక్కుకుని అల్లాడిపోతోంది. ఆదివారం తెల్లవారు జాము నుంచి ఇదే తరహాలో వరద రాగా.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు ఉధృతి భారీగా పెరిగిపోయింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే 30 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ఖమ్మం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు సంభవించడంతో పట్టణం నడిబొడ్డున కూడా ఐదు అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. రెండు రోజుల నుంచి స్థానికులు వరద నీటిలో ఉండాల్సిన పరిస్థితి రావడంతో ప్రభుత్వం, అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అయ్యారని.. ముగ్గురు మంత్రులు ఉన్న ఎటువంటి ప్రయోజనం లేదని.. అంటున్నారు. కాగా ఖమ్మం పట్టణంతో పాటు జిల్లాకు సంబంధించిన వరద వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Similar News