Mrs South India -2024: తగ్గేదేలే.. మిసెస్ సౌత్ ఇండియాగా హైదరాబాద్ యువతి

మిసెస్‌ సౌత్‌ ఇండియా- 2024 కిరీటం హైదరాబాద్‌కు చెందిన వర్షారెడ్డిని వరించింది.

Update: 2024-08-24 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: మిసెస్‌ సౌత్‌ ఇండియా- 2024 కిరీటం హైదరాబాద్‌కు చెందిన వర్షారెడ్డిని వరించింది. కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన మిసెస్‌ సౌత్‌ ఇండియా పోటీల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 మంది ఫైనల్స్‌కు ఎంపిక కాగా వర్షారెడ్డి టైటిల్‌ విజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. "తెలంగాణ నుంచి వెళ్లి టైటిల్‌ సాధించడం సంతోషంగా ఉంది. మిస్‌ సౌత్‌ ఇండియా-2012 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నేను మిస్‌ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించాను" అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా, వర్షారెడ్డి హైదరాబాద్‌లోని పలు ఐటీ కన్సల్టింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, సినిమా ప్రొడక్షన్‌ సంస్థలకు వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.


Similar News