SC వర్గీకరణ కేసు త్వరగా విచారణ జరపండి

తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై దాఖలైన కేసు త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీసుకువెళ్లింది.

Update: 2023-09-25 07:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై దాఖలైన కేసు త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీసుకువెళ్లింది. ఈ కేసు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉందని ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకోవడం లేదని ఎంఆర్పీఎస్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సీజేఐ ముందు ప్రస్తావించారు.

దీనిపై స్పందించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ త్వరలోనే విచారణ చేపట్టేందుకు సమయం ఇస్తామని తెలిపారు. ఏదైనా ఒక తేదీ ఇవ్వాలని రోహత్గీ కోరగా అందుకు సీజేఐ అంగీకరించారు. కాగా, ఎన్నికల వేళ మరోసారి ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ బలపడుతోంది. ఈ నేపథ్యంలో వర్గీకరణపై దాఖలైన కేసును త్వరగా విచారించాలని ఎంఆర్పీఎస్ నేతలు సుప్రీంకోర్టును కోరుతున్నారు.

Tags:    

Similar News