తెలంగాణకు హోంమంత్రి ఉన్నాడా.. ఎంపీ కోమటిరెడ్డి సీరియస్

నారాయణ, చైతన్య కాలేజీ యాజమాన్యాలకు పోలీసులు అమ్ముడుపోయారా? అని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

Update: 2023-03-02 09:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నారాయణ, చైతన్య కాలేజీ యాజమాన్యాలకు పోలీసులు అమ్ముడుపోయారా? అని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య బాధాకరణం అన్నారు. బాధిత కుటుంబానికి వెంకట్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గురువారం నార్సింగి శ్రీచైతన్య కాలేజీకి వెళ్లిన వెంకట్‌రెడ్డి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యానికి వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని.. సాత్విక్ సూసైడ్ లేఖలో పేర్కొన్న వ్యక్తులను అరెస్ట్ చేశారా? అని సీఐని ప్రశ్నించారు. ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న తనతో మాట్లాడే తీరు ఇదేనా అంటూ సీఐపై ఎంపీ సీరియస్ అయ్యారు.

సూసైడ్ లెటర్‌లో సాత్విక్ ప్రస్తావించిన వేధింపులను గుర్తుచేశారు. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని వెంకట్‌రెడ్డి ప్రస్తావించారు. చిత్తూరులో టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణకు అసలు హోంమంత్రి ఉన్నాడా ? అని ప్రశ్నించారు. విద్యార్ధులను ఇష్టారీతిలో కొట్టిన కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ల ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారన్నారు. మరొకరు బలవ్వకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News