ఎన్నికల ఫలితాలపై కమిటీలు వేయడానికి కారణమిదే.. MP రఘువీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పార్టీలో గెలుపుఓటములపై విశ్లేషించుకోవడం నిరంతరమైన ప్రాసెస్ అన్నారు.

Update: 2024-06-20 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో గెలుపుఓటములపై విశ్లేషించుకోవడం నిరంతరమైన ప్రాసెస్ అన్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో తెలంగాణ ఎంపీ ఎన్నికల ఫలితాలపై కమిటీ వేయడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ గెలుస్తామని భావించామని అక్కడ కేవలం 3వేల మెజార్టీతో తమ అభ్యర్థి ఓడిపోయాడన్నారు. మెదక్ ఎంపీ స్థానం సైతం ఖచ్చితంగా గెలుస్తామని భావించామని అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై సిద్ధిపేటలో ఏకంగా హరీష్ రావు కాషాయ పార్టీకి ఓట్లు వేయించారని రఘువీర్ రెడ్డి ఆరోపించారు. 25 నుంచి 30 స్థానాలు తమకు అధికంగా వచ్చి ఉంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు. హర్యానా, ఢిల్లీలో ఎలక్షన్స్ రానున్నాయని అక్కడ సైతం పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పార్టీయే లోకల్ ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో సైతం ఓవరాల్‌గా తమ పార్టీకే అధికంగా ఓట్లు పోలయ్యాయని తెలిపారు.  


Similar News