సిట్ నోటీసులపై ఎంపీ రఘురామకృష్ణంరాజు రియాక్షన్ ఇదే..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై ఏపీ నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. నిన్న సాయంత్రం తెలంగాణ సిట్ తనకు నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

Update: 2022-11-25 12:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై ఏపీ నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. నిన్న సాయంత్రం తెలంగాణ సిట్ తనకు నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన నివాసానికి కూడా సిట్ నోటీసులు పంపినట్లు తెలిపారు. ఈనెల 29న ఉదయం 10.30కు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నట్లు వెల్లడించారు. సిట్ ఇచ్చిన నోటీసులకు హాజరవుతానని అన్నారు. ప్రజాప్రతినిధిని కాబట్టి ఎవరితోనైనా ఫొటోలు దిగాల్సి ఉంటుంది. జగన్ రెడ్డి 32 కేసుల్లో 420గా ఉన్నారని అన్నారు. జగన్‌తో ఫొటోలో 151 మంది ఎమ్మెల్యేలు ఉంటారని.. ఫొటోలో ఉన్నంత మాత్రాన అందరూ నేరస్థులు కారు అని రఘురాం వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి, నంద కుమార్ ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. అలా ఉంటే కిషన్ రెడ్డికి కూడా నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా తానెప్పుడు మాట్లాడలేదని అన్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని చాలా సందర్భాల్లో చెప్పానని, కలలో కూడా సీఎం కేసీఆర్‌ కు హాని చేసే వ్యక్తిని కాదన్నారు. అంతేకాకుండా, సీఎం కేసీఆర్ ఓ మంచి పాలకుడని వ్యాఖ్యానించారు. ఇక తాను హైదరాబాద్‌‌లో ఒక సెటిలర్‌నని.. తనలాంటి వారు చాలా మంది ఉన్నారన్నారు. రూ.100 కోట్లు అంటూ సాక్షిలో తనపై దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. ఇక 29న సిట్ ఇచ్చిన నోటీసులకు హాజరవుతానని.. జగన్ నీలినీడ నాపై పడకుండా చూసుకుంటానంటూ ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Ap High Court: విధులు బహిష్కరించిన న్యాయవాదులు 

Tags:    

Similar News