MP Laxman: రాజకీయ విమర్శలు ఇకనైనా మానుకో రేవంత్: ఎంపీ లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Update: 2024-07-24 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలో‌ మంత్రులుగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంరద్భంగా ఆయన వ్యాఖ్యలకు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు మానుకుని రాష్ట్రంలో పాలనపై దృష్టి పట్టాలని హితువు పలికారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపైకి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కుర్చీ కోసం తాపత్రయపడి అలవికాని హమీలను అమలు చేయలేక లోక్‌సభ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ 8 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. హామీల ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందోనని కాంగ్రెస్ మంత్రులు తప్పించుకు తిరుగున్నారని ఫైర్ అయ్యారు. గత పదేళ్లలో తెలంగాణకు వివిధ పథకాల ద్వారా రూ.10 లక్షల కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎంపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారని లక్ష్మణ్ స్పష్టం చేశారు.   

Tags:    

Similar News

టైగర్స్ @ 42..