కాంగ్రెస్ వల్లే ‘పీఓకే’.. హస్తం పార్టీపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
కాంగ్రెస్ వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ఏర్పడిందని, కశ్మీర్ భూభాగాన్ని పాక్ అక్రమంగా ఆక్రమించిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ఏర్పడిందని, కశ్మీర్ భూభాగాన్ని పాక్ అక్రమంగా ఆక్రమించిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మైనారిటీలను రెచ్చగొట్టి ఓట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్.. మెజారిటీ వర్గాలను కించపరుస్తూ మాట్లాడుతోందని ఫైరయ్యారు. మోడీ ఎక్కడా కుల, మత ప్రస్తావన తెలేదన్నారు. ముస్లిం సంతుష్టీకరణ కాంగ్రెస్ డీఎన్ఏలో ఉందని ఆయన పేర్కొన్నారు. హిందువులపై విషం చిమ్ముతూ దేవుళ్ళను అవమానపరుస్తుంటే విపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడునా అడ్డుకుందన్నారు. బీసీ ఏలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారని లక్ష్మణ్ అన్నారు.
మళ్ళీ ప్రత్యేక కోట కింద 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. బీసీల వాటాను ముస్లింలు తన్నుకుపోతున్నారని తెలిపారు. రేవంత్ ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులు కాలరస్తూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని లక్ష్మణ్ విమర్శలు చేశారు. మత ప్రాతిపదిక రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలన్నారు. దేశ వనరులు ముస్లింలకు దక్కాలని గత ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని, దేశ సంపదను ఎవరికి దోచి పెట్టాలని చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. శ్యాం పిట్రోడ 55 శాతం సంపద తీసుకొని ఎవరికి దోచి పెట్టాలని అనుకుంటున్నారన్నారు. రాజ్యాంగం మార్చే ప్రసక్తే లేదని, దీనిపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తొలగించేది లేదన్నారు.
60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు జనగణన చేయలేకపోయిందనిన ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లను అమలు చేస్తున్నది కాంగ్రెస్ అని ఫైరయ్యారు. బాబ్రీ మసీద్ నిర్మించుకోవాలని భూమి కూడా కేటాయించారని, వారు నిర్మించుకుంటామంటే అడ్డుకునేదెవరని లక్ష్మణ్ ప్రశ్నించారు. మోడీ పాలనను జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలపై కమ్యూనిస్టులకు నమ్మకం లేదన్నారు. చైనా సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకే కమ్యూనిస్టులు ఇక్కడ అస్తిత్వాన్ని కోల్పోయారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎందుకు రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ జరిగేలా చూడటం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. మెడకాయ మీద తలకాయ లేనివారే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటని ప్రచారం చేస్తారని లక్ష్మణ్ మండిపడ్డారు.
Read More..
రిజర్వేషన్లపై అమిత్ షా ది ఫేక్ వీడియో! MP అర్వింద్ ఆసక్తికర ట్వీట్