బండి సంజయ్ కాన్వాయ్‌ని ఆపిన పోలీసులు.. కారణం ఇదే..!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కారును పోలీసులు తనికీ చేశారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కారును పోలీసులు తనికీ చేశారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ముస్తాబద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామ శివారులోకి రాగానే అక్కడ ఉన్న చెక్ పోస్ట్ వద్ద బండి కాన్వాయ్‌ని పోలీసులు ఆపారు. అనంతరం కార్లను క్షుణ్ణంగా పరిశీలించి వదిలేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల అనంతరం బండి సంజయ్ ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.