కేటీఆర్.. ఆ రికార్డ్‌లు చూడు.. నా గురించి తెలుస్తది: బండి సంజయ్ కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎంపీగా తాను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లలేదని

Update: 2024-03-10 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎంపీగా తాను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లలేదని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాడుతున్నారు.. కావాలంటే పార్లమెంట్ సమావేశాల రికార్డ్‌లు చూడు.. నేను పార్లమెంట్‌కు వెళ్లానో లేదో తెలుస్తోందని కౌంటర్ ఇచ్చారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారని, ఏ మొహం పెట్టుకుని కరీంనగర్‌లో కదనభేరి సభ నిర్వహిస్తున్నారని నిలదీశారు. ప్రజలను మోసం చేసినందుకు మాజీ సీఎం కేసీఆర్ కదనభేరి సభ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని బండి డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపిన నిధులను విడుదల చేయాలన్నారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..