జమిలి ఎన్నికలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ జరుగుతుంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ పేరుతో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రస్తుతం జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ జరుగుతుంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ పేరుతో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రిపోర్టు ప్రస్తుతం రాష్ట్రపతి వద్దకు చేరుకుంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉన్నా ఇంకా రాకపోవడంతో జమిలి ఎన్నికల ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. జమిలి ఎన్నికలతో రాజ్యాంగ పరమైన సమస్యలు ఉన్నాయి.
ఈ ఎన్నికలు దేశ సమాఖ్య స్ఫూర్తికి చరమగీతం అవుతుందని.. ఈ విధానం దేశాన్ని ఏక పార్టీ దేశంగా మారుస్తుందని ఒవైసీ అన్నారు. అలాగే.. దేశంలో తరచూ ఎన్నికలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలను, వారి ఆగ్రహాన్ని పట్టించుకోవడం లేదని.. ఇలా చేస్తే ప్రభుత్వాలు ప్రజలపై మరింత అశ్రద్ద చూపుతారని.. ప్రజల గురించి పార్టీలు ఆందోళన చెందే అవసరం లేకపోవడం సరికాదని.. ఒవైసీ తన అభిప్రాయాన్ని తెలిపారు.