బీపీ, హైపర్ టెన్షన్ కారణంగా మోహన్ బాబు స్థిమితంగా ఉండలేక పోతున్నాడు: డాక్టర్లు
మంచు ఫ్యామిలీ వివాదం(Manchu Family Controversy) గంటకో మలుపు తిరుగుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీ వివాదం(Manchu Family Controversy) గంటకో మలుపు తిరుగుతుంది. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన విషయాలను తండ్రీకొడుకుల గొడవ కారణంగా మీడియా ఎక్కడంతో వారి వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. అలాగే మోహన్ బాబు(Mohan babu) మంగళవారం రాత్రి.. ఓ టీవీ రిపోర్టర్ పై దాడి(Attack on reporter) చేయడం.. సంచలనంగా మారింది. అయితే ఈ దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మోహన్ బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ధర్నాలు చేస్తున్నారు. కాగా రాత్రి రిపోర్టర్ పై దాడి చేసిన నటుడు మోహన్ బాబు.. నేరుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు.
దీంతో అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అనంతరం పలు టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం కాంటినెంటల్ ఆస్పత్రి(Continental Hospital) వైద్య బృందం.. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై వివరాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఓ డాక్టర్ మాట్లాడుతూ.. నటుడు మోహన్ బాబుకు బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నాయి. దీంతో ఆయన స్థిమితంగా ఉండలేక పోతున్నారు. దీంతో ఆయన చుట్టు ఏం జరుగుతుందో మోహన్ బాబుకు అర్థం కావడం లేదని ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని.. ఆయన హార్ట్ రేట్ ఎక్కువగా ఉందని, కన్ను కింద ఇంకా వాపు ఉందనని.. కనీసం రెండు రోజుల పాటు ఆయనకు చికిత్స అవసరం అని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు మీడియాతో తెలిపారు.
Read More : హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్.. కీలక అభ్యర్థనలు