Mohan Babu: కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి పోలీసులు.. ప్రధాన కారణం అదే!
జర్నలిస్ట్ (Journalist)పై దాడి కేసులో నటుడు మోహన్ బాబు (Mohan Babu)పై పహాడీ షరీఫ్ (Pahadi Sharif) పోలీసులు BNS 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్ట్ (Journalist)పై దాడి కేసులో నటుడు మోహన్ బాబు (Mohan Babu)పై పహాడీ షరీఫ్ (Pahadi Sharif) పోలీసులు BNS 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరికొద్దిసేపట్లోనే పోలీసులు జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. హత్యాయత్నం కేసులో ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు. అనంతరం మోహన్‌బాబు వెపన్‌ను కూడా స్వాధీనం చేసుకోనున్నారు. కాగా, హైదరాబాద్ (Hyderabad)లోని జల్‌పల్లి (Jalpally)లో మోహన్ బాబు(Mohan Babu) నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్, మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
అనంతరం సెక్యూరిటీతో మనోజ్ (Manoj) వాగ్వాదానికి దిగి గేట్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలోనే కవరేజీ కోసం లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు దుర్భాషలాడుతూ.. ఓ జర్నలిస్టుపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ (Journalist)పై దాడి ఘటనలో మోహన్‌బాబు (Mohan Babu)పై ముందు పహాడీ షరీఫ్ (Pahadi Sharif) పోలీసులు 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, గురువారం లీగల్ ఒపీనియన్ తీసుకుని పోలీసులు ఆయనపై BNS 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.