మోడీ రాజీనామా చేయాలి: బక్క జడ్సన్

మోడీ ప్రభుత్వం వైఫల్యం వలన పుల్వమా దాడిలో ఏకంగా 40 మంది సీఆర్​పీఎఫ్ ​జవాన్​లు మరణించారని కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​పేర్కొన్నారు.

Update: 2023-04-18 16:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మోడీ ప్రభుత్వం వైఫల్యం వలన పుల్వమా దాడిలో ఏకంగా 40 మంది సీఆర్​పీఎఫ్ ​జవాన్​లు మరణించారని కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​పేర్కొన్నారు. దీంతో వెంటనే ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నదని జడ్సన్​డిమాండ్​చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా 2019‌లో కశ్మీర్‌లోని పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దాడి విషయంలో భారత ప్రభుత్వాన్ని నిందించినట్లు గుర్తు చేశారు.

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి 'వ్యవస్థ అసమర్థత, నిర్లక్ష్యం' ఫలితమేనని మాలిక్​చెప్పినట్లు జడ్సన్​స్పష్టం చేశారు. ఆ దాడికి సీఆర్‌పీఎఫ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆయన నిందించారన్నారు. తమ సిబ్బందిని తరలించేందుకు విమానాలను సమకూర్చాలని సీఆర్‌పీఎఫ్ ప్రభుత్వాన్ని కోరిందని, అయితే హోం శాఖ అందుకు నిరాకరించిందని మాలిక్ చెప్పినట్లు జడ్సన్​పేర్కొన్నారు.

ఆ సంఘటన జరిగిన సమయంలో రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారని, అయినప్పటికీ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో భారత ప్రభుత్వం సరైన భద్రతా తనిఖీలు చేయలేదన్నారు. ఆ దాడికి నిఘా సంస్థల వైఫల్యమే కారణమన్నారు. పాకిస్తాన్ నుంచి 300 కిలోల ఆర్‌డీఎక్స్‌తో కూడిన ట్రక్కు 10 నుంచి 15 రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో తిరుగుతూనే ఉందని, దాని గురించి ఇంటెలిజెన్స్‌కు క్లూ ఎలా లభించలేదని ఆయన ఆశ్చర్యం సత్యపాల్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పినట్లు జడ్సన్​వివరించారు.అయితే ఈ విషయంలో మౌనంగా ఉండాలని, ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దని స్వయంగా ప్రధాని మోదీ కోరారని సత్యపాల్ మీడియా సాక్షిగా చెప్పారని బక్క జడ్సన్​వెల్లడించారు.

Tags:    

Similar News