నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష.. విద్యార్థులకు మాస్క్ మస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడ‌ల్ స్కూళ్లలో ప్రవేశాలకు పరీక్షను అధికారులు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

Update: 2023-04-15 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడ‌ల్ స్కూళ్లలో ప్రవేశాలకు పరీక్షను అధికారులు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయా తరగతుల వారీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అధికారులు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 6వ త‌ర‌గ‌తిలో 19,400 సీట్లు ఖాళీగా ఉండ‌గా, 40,137 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 7వ తరగతి నుంచి 10వ త‌ర‌గ‌తి వరకు సీట్ల భర్తీకి సైతం భారీగానే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అయితే కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్రవేశ పరీక్షను నిర్వశహించనున్నారు. ఇటీవల కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను అధికారులు విధించారు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు ముందుగానే చేరుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా 6వ త‌ర‌గ‌తిలో ప్రవేశం పొందే విద్యార్థుల‌కు ఆదివారం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పరీక్ష కొనసాగనుంది. 7వ తరగతి నుంచి 10 వ త‌ర‌గ‌తి వరకు విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పరీక్ష నిర్వహించనున్నారు. మే 24వ తేదీన మెరిట్ జాబితా విడుద‌ల చేయ‌నున్నారు. మెరిట్ జాబితాలో ఉన్న విద్యార్థుల‌కు మే 25 నుంచి 31 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించ‌నున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు సహా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే విద్యార్థులు.. 040-23120335, 23120336 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News