కేంద్ర ప్రభుత్వంపై MLC కవిత సంచలన వ్యాఖ్యలు

చేనేత‌పై బ్రిటిష్ వాళ్ళు కూడా పన్నులు విధించలేదని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కనికరం లేకుండా పన్ను విధించిందని ప్రధాని మోడీపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు.

Update: 2023-08-29 12:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చేనేత‌పై బ్రిటిష్ వాళ్ళు కూడా పన్నులు విధించలేదని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కనికరం లేకుండా పన్ను విధించిందని ప్రధాని మోడీపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పద్మశాలీలతో ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకునే క్రమంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వచ్చామని వెల్లడించారు. తెలంగాణ రాకముందు పద్మశాలీల కులవృత్తి ప్రమాదంతో ఉండేదని, ఆ సామాజికవర్గానికి చెందిన వారికి ఎక్కువ భూములు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను కుదేలు చేశాయని విమర్శించారు. బీడీ కార్మికులకే కాకుండా టేకేదారులకు కూడా పెన్షన్ అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

Tags:    

Similar News