MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత నయా స్ట్రాటజీ.. బీసీ నినాదం వెనుక బిగ్ స్కెచ్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవిత.. విడుదలైన తరువాత కూడా కొద్దికాలంపాటు ఇంటికే పరిమితం అయ్యారు.

Update: 2025-01-06 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవిత.. విడుదలైన తరువాత కూడా కొద్దికాలంపాటు ఇంటికే పరిమితం అయ్యారు. రాజకీయాల జోలికి రాకుండా మౌనంగానే ఉండిపోయారు. ఈ మధ్యే ఆమె పాలిటిక్స్‌లో యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. వివిధ కార్యక్రమాలతో నానా హడావుడి చేస్తున్నారు. అయితే.. ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా బీసీ జపం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కవిత కొత్త పాలి‘ట్రిక్స్’పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేడర్‌లో కూడా ఆమెపై పలురకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని కవిత.. ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకోవడంపై రాజకీయవర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత మళ్లీ జాగృతి సంస్థను రివోక్ చేసి, సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. అందుకోసం జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ ఎజెండాను ఎత్తుకున్నారని సొంత పార్టీ నేతల నుంచే సెటైర్లు వినిపిస్తున్నాయి.

కవిత బీసీ రాగం అందుకేనా..!

తిహార్ జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత కవిత కొంత కాలం ఇంటికే పరిమితం అయ్యారు. రాష్ట్రంలో ఏం జరిగినా మౌనంగా ఉన్నారు. కానీ.. కొన్ని రోజులుగా కవిత మళ్లీ జనంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తన సొంత సంస్థగా ఉన్న జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా కవిత హడావుడిని గమనిస్తున్న గులాబీ లీడర్లు రాజకీయాల్లో తన అస్తిత్వం కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లు కామెంట్ చేస్తున్నారు. ఓ వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మరోవైపు మాస్ లీడర్‌గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో కవిత రావడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడాన్ని చూసి తన రాజకీయ అస్తిత్వం కోసం కవిత ఆరాట పడుతున్నారన్న టాక్ నడుస్తున్నది. అందుకోసం జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిత్యం డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీ.. బీసీ అనే పదాన్ని జపం చేస్తున్నారు. దీంతో ఆమె వైఖరిపై కేడర్‌తోపాటు ప్రజల్లోనూ విమర్శలు వస్తున్నాయి.

సీఎం పదవి కోసం ఆశలు!

కవిత రీసెంట్‌గా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న జాగృతి కార్యకర్తలు ‘కవిత సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు ఉత్సాహంతో ఆ నినాదాలు చేస్తున్నారా? లేకపోతే ఎవరైనా ప్రోత్సహిస్తే చేస్తున్నారా? అనే అనుమానాలు గులాబీ లీడర్లలో ఉన్నాయి. నిజానికి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత పోటీ చేయలేదు. అలాగే ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం నిలబడలేదు. ఇప్పటివరకు ఆమె కేవలం 2014 ఎన్నికల్లో ఒకసారి మాత్రమే ఎంపీగా గెలిచారు. కానీ.. సీఎం పదవి కోసం ఆటు అన్న కేటీఆర్‌తో, ఇటు బావ హరీశ్‌తో పోటీ పడుతున్నారనే అనుమానాలు కేడర్‌లో కలుగుతున్నాయి. ఒకవేళ ఆమెకు సీఎం కావాలనే ఆశ లేకపోతే జాగృతి కార్యకర్తల నినాదాలను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.

కవిత ఎంట్రీతో కన్‌ఫ్యూజన్

కవిత జాగృతి పేరుతో ‘సొంత దుకాణం’ తెరవడం ఏంటని గులాబీ లీడర్లే ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మీడియాలో కవరేజ్ కోసం బావబామ్మర్దులైన హరీశ్, కేటీఆర్ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతున్నదన్న విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తే మరొకరు అందుకు పోటీగా ఇంకో కార్యక్రమం నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ మధ్య అసెంబ్లీ సాక్షిగా కూడా ఇరువురు పోటాపోటీ ప్రోగ్రామ్స్ దీనికి సాక్ష్యంగా నిలిచాయి. అయితే.. వీరిద్దరి మధ్యలో కవిత సొంత ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల పార్టీ కేడర్‌లో కన్ఫ్యూజన్ మొదలైంది. దీంతో ఎవరి కార్యక్రమానికి వెళ్లాలో అర్థం కాక పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అయోమయంలో పడిపోయారు.

నాడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలే..

పవర్‌లో ఉన్నప్పుడు కవిత ఏనాడూ బీసీల గురించి మాట్లాడలేదు. జనాభా మేరకు ఆ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. చివరికి సావిత్రి బాయి పూలే జన్మదినం కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని సైతం తన తండ్రి కేసీఆర్‌ను కోరలేదు. మరోవైపు కేసీఆర్ కేబినెట్‌లో బీసీ మంత్రులకు సరైన శాఖలు ఇవ్వనప్పుడూ ప్రశ్నించలేదు. బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పుడు సైతం మౌనంగా ఉన్నారు. వీటన్నింటికీ మించి కేసీఆర్ కేబినెట్‌లో ఓ బీసీ మంత్రిని కవిత అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసి కూడా మౌనంగా ఉన్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తరవాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు మాత్రం కవిత పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం పలు బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.

జాగృతి కమిటీలు అప్పుడు ఎందుకు రద్దు చేశారు?

రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జాగృతి సంస్థ కార్యక్రమాలకు కవిత ఫుల్‌స్టాప్ పెట్టారు. అప్పటివరకు ఉన్న జిల్లా కమిటీలను రద్దు చేశారు. ఉన్నఫళంగా అప్పుడు రద్దు చేసి, మళ్లీ ఇప్పుడు యాక్టివ్ చేయడంతో జాగృతి లీడర్లు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శక్తివంచన లేకుండా కార్యక్రమాలు చేసి, అధికారంలోకి వచ్చిన తరువాత తమను పక్కన పెడుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కొందరు జాగృతి లీడర్లు గులాబీ లీడర్లకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించి, అసెంబ్లీ టికెట్లకు పోటీ పడ్డారు. తీరా కమిటీల రద్దుతో డీలా పడ్డారు. అయితే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఓ వైపు జాగృతి కార్యక్రమాలు, మరోవైపు పార్టీ ప్రోగ్రామ్స్‌తో జిల్లా లీడర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్ జాగృతి యాక్టివిటీస్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆదేశించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు కవిత మళ్లీ జాగృతి సంస్థను యాక్టివ్ చేయడం వెనుక కేసీఆర్ గైడెన్స్ ఉన్నాయా? అనే చర్చ జరుగుతున్నది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవిత.. విడుదలైన తరువాత కూడా కొద్దికాలంపాటు ఇంటికే పరిమితం అయ్యారు. రాజకీయాల జోలికి రాకుండా మౌనంగానే ఉండిపోయారు. ఈ మధ్యే ఆమె పాలిటిక్స్‌లో యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. వివిధ కార్యక్రమాలతో నానా హడావుడి చేస్తున్నారు. అయితే.. ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా బీసీ జపం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కవిత కొత్త పాలి‘ట్రిక్స్’పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేడర్‌లో కూడా ఆమెపై పలురకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని కవిత.. ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకోవడంపై రాజకీయవర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత మళ్లీ జాగృతి సంస్థను రివోక్ చేసి, సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. అందుకోసం జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ ఎజెండాను ఎత్తుకున్నారని సొంత పార్టీ నేతల నుంచే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News