‘‘రైతన్న, నేతన్న.. ఇప్పుడు గీతన్న’’.. ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్
కల్లు గీత కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల బీమా ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: కల్లు గీత కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల బీమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రైతన్న, నేతన్న.. ఇప్పుడు గీతన్న అంటూ ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ‘రైతుబీమా’ తరహాలో కల్లుగీత వృత్తిదారులకు ప్రభుత్వం బీమా అందిస్తున్నామని చెప్పారు. ప్రమాదవ శాత్తు చనిపోయిన గీత కార్మికుడి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని వారం రోజుల్లోనే నేరుగా బ్యాంకు ఖాతాలో జమయ్యేలా సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. గౌడన్నల కుటుంబాలకు సీఎం కేసీఆర్ నిర్ణయం గొప్ప భరోసా ఇస్తోందని కవిత తెలిపారు.
Read more:
అక్కడ KCR.. ఇక్కడ KTR.. బీఆర్ఎస్ బలోపేతంపై తండ్రి కొడుకుల ఫోకస్