MLC Kavitha: ‘సెరికల్చర్’ ఖాళీలను భర్తీ చేయాల్సిందే.. శాసనమండలిలో కవిత ఫైర్!

రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2024-12-16 08:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ శాసన మండలి (Legislative Council) సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడారు. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని వెల్లడించారు. ప్రభుత్వం రూ.16 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టకపోవడం శోచనీయమని అన్నారు. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

సెరికల్చర్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బెంగళూరు నుంచి పట్టు దిగుమతితో చేనేతలకు అదనపు భారమన్నారు. తేనెటీగల పెంపకం అనేది రైతులు, అడవులకు మంచిదని తెలిపారు. దిగుబడి పెంచే ఆస్కారం ఉందని, గిరిజనులకు ఉపాధి ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరారు.

విదేశీ విద్యకు ఎలాంటి ప్రోత్సహకాలు లేవు

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉండేవని, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో 275 బిసి పాఠశాలలు ఏర్పాటు చేసాము. 31 డిగ్రీ బిసి కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది కొత్తవి బీసీ గురుకులాలు ఏర్పాటు చేయలేక పోవడం బాధాకరమన్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఎలాంటి ప్రోత్సహకాలు లేవు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది చెప్పాలని తెలిపారు. గురుకులాల్లో మెనూ మార్చామని చెప్పారు కానీ స్కూల్స్‌లో ఇంకా ప్రారంభం కాలేదని, ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలని కోరారు.

Tags:    

Similar News