హైడ్రా కూల్చివేతల్లో ఎంఎల్ఏ ఇల్లు

జీహెచ్ఎంసి పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది.

Update: 2024-08-10 13:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : జీహెచ్ఎంసి పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, రోడ్లు, వీధులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. శివరాంపల్లి, చందానగర్, హఫీజ్ పేట్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారు జాము నుంచి భారీ పోలీసు బందోబస్తు సహాయంతో కూల్చివేతలు కొనసాగాయి. ఈ ఒక్కరోజే 50 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని అధికారులు తెలిపారు. కాగా ఈ అక్రమ నిర్మాణాల్లో బహుదూర్ పురా ఎంఐఎం ఎంఎల్ఏ మహ్మద్ ముబేన్ కు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. కూల్చివేతల విషయం తెలుసుకున్న ఎంఎల్ఏ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకొని రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. చందానగర్ సర్కిల్ లోని ఈర్ల చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన 3 అక్రమ నిర్మాణాలను, శివరాంపల్లిలో 18 ఎకరాల చెరువులో కబ్జాకు గురైన 5 ఎకరాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసినటట్లు హైడ్రా అధికారులు తెలిపారు.    


Similar News