CM రేవంత్‌ను కలవడంపై క్లారిటీ ఇచ్చిన MLA తెల్లం వెంకట్రావు

సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-03-03 07:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెల్లం కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు విస్తృతమైన వేళ ఆయన మంత్రి పొంగులేటితో పాటు కుటుంబసమేతంగా సీఎంను కలవడం ఆసక్తిగా మారింది. తాజాగా.. దీనిపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని అన్నారు.

భద్రాచలం రామాలయం అభివృద్ధిపై చర్చించామని తెలిపారు. ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరినట్లు వెల్లడించారు. భద్రాచలం పట్టణంలోని రెండు వార్డులు ఆంధ్రాలో ఉన్నాయని.. దీని వలన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డు సైతం లేదని తెలిపినట్లు సమాచారం.

Tags:    

Similar News