మంత్రి కేటీఆర్‌పై MLA సీతక్క సీరియస్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ములుగు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్పందించారు.

Update: 2023-06-09 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ములుగు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు కక్షగట్టి తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తరహా ఫలితాలు తెలంగాణలో రిపీట్ కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ములుగు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబం అని, తన ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ వాళ్లు తన ఇంటి గడప తొక్కినా.. ఎవరు ఫోన్ చేసినా ఒకేలా స్పందిస్తానని తెలిపారు. ఎప్పుడు ప్రజల్లో తిరగని వారు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇవాళ వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇదంతా ప్రజలు గమనించాలని కోరారు. ఇవాళ తనను బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారని, అయినా.. తనకేం భయం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేసి తనను ఎంత విమర్శించిన భరిస్తానని తెలిపారు.

Also Read: సీఎం సార్‌కు.. సమస్యల సవాళ్లు

అనూహ్యంగా వ్యూహం మార్చిన కేసీఆర్.. బలం పుంజుకుంటోదనే భయం!


Similar News