బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం.. పార్టీనుంచి MLA Raja Singh సస్పెండ్

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌పై హైకమండ్ సీరియస్ అయ్యింది. మహమ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వివాదాస్పద వీడియోపై బీజేపీ సీరియస్ అయ్యింది.

Update: 2022-08-23 09:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌పై హైకమండ్ సీరియస్ అయ్యింది. మహమ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వివాదాస్పద వీడియోపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా.. శాసన సభ పక్ష నాయకుడిగా కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాజాసింగ్ వ్యవహారంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సస్పెన్షన్‌ను తక్షణమే అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు చేసింది.

ఈ వ్యవహారంపై పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. కాగా, రాజాసింగ్ వ్యవహారంపై హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్ఐఎమ్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ సహా విపక్షాలన్నీ రాజాసింగ్‌పై ఆగ్రహంగా ఉన్నాయి.




 



Similar News