60 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏమి చేయలే: కాంగ్రెస్‌పై రఘునందన్ రావు ఫైర్
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. దేశంలో 60 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏమి చేయలేదని మండిపడ్డారు. ఎన్నికలు వస్తే హామీలు ఇస్తారే తప్ప అమలు చేయరని అన్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా కర్నాటకలో కూడా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శలు గుప్పించారు.