గుండు చేసుకున్నంత మాత్రాన RSP అంబేద్కర్ అయిపోడు: కాంగ్రెస్ MLA మాస్ సెటైర్

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు మాస్ సెటైర్ వేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన

Update: 2024-05-29 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు మాస్ సెటైర్ వేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుండు చేసుకున్నంత మాత్రాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ అయిపోడని ఎద్దేవా చేశారు. దయచేసి దళితులు ఎవరూ ఆయన మాట నమ్మెదని ఎమ్మెల్యే కోరారు. దళితులను ఆదుకుని అక్కున చేర్చుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కాగా, తెలంగాణ బీఎస్పీ చీఫ్‌గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల ఆ పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఎస్పీకి గుడ్ బై చెప్పిన ఆర్ఎస్పీ.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఎస్పీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఫ్యామిలీపై విరుచుకుపడిన ప్రవీణ్ కుమార్.. చివరికి తిరిగి ఆ పార్టీలోనే చేరడంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 


Similar News