రాజకీయాల్లో దానం నాగేందర్ చాప్టర్ క్లోజ్.. MLA కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్

త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. ఆ పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన

Update: 2024-06-21 12:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. ఆ పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు. దానం నాగేందర్ పరిధులు దాటి మాట్లాడారని, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం కూడా చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లేనని అన్నారు. ఎమ్మెల్యే అంటే అధికారంలో ఉండటమే కాదని.. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే అంటారని దానం గ్రహించాలని చురకలంటించారు. రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చి సంపాదనలో పడ్డ దానం లాగా మేము పార్టీలు మారబోమని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


Similar News